UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 రూ.కోటి 78లక్షలతో పోస్తున్న బిటి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మెచ్చా

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే 17: మండల పరిదిలోని బుధవారం ఎమ్మెల్యే మెచ్చా విస్తృతంగా పర్యటించారు. గత మూడు రోజులుగు మండుటెండలు సైతం లెక్కచెయ్యకుండా పలు బీటు రోడ్డులు ప్రారంభించారు. మండల పరిదిలోని మొద్దులగూడెం, నారంవారిగూడెం, నారంవారిగూడెం కాలని, పాతఅల్లిగూడెం, పెరాయిగూడెం, గుర్రాలచెరువు గ్రామాల్లో పర్యటించి రూ. 82లక్షల వ్యయంతో పోసిన సీసీ రోడ్లను ఆయన బుధవారం ప్రారంభించారు. అలాగే దిశ అశ్వారావుపేట నియోజకవర్గ విలేకర్ దిలీప్ ఖన్నా పెద్ద కుమార్తె జయకీర్తి 6వ పుట్టినరోజు వేడుకలో పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం అశ్వారావుపేట టౌన్ లో జియో 5జి నీ లాంచ్ చేసారు. మొద్దులగూడెం గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభించేందుకు వెళ్లిన మెచ్చా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కరెంట్ స్థంబాలు అవసరం ఉందని, డ్రైనేజ్ లేకపోవడంతో వరద ఇండ్లల్లోకి వస్తుందని, అలాగే అంగణవాడి కేంద్రం వద్ద గేట్ వాల్ ఏర్పాటు చేయాలని పెద్ద గుంత తీసి దానిని అల వదిలేశారని గతంలో ఆ గుంతలో పడి ఒక చిన్నారి మృతి చెందారని తెలుపడంతో వెంటనే స్పందించిన మెచ్చా ఏడి తో మాట్లాడారు, స్థంబాలు ఏర్పాటు చేయాలని అలాగే అక్కడే ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఏఈ కి డ్రైనేజ్ ఏర్పాటుకు అంచనా వేసీ అందించాలని మరియు అంగణవాడి కేంద్రం వద్ద తీసిన గుంతను వెంటనే పుడ్చలని సంబంధిత శాఖ అధికారికి ఆదేశించారు. నారంవారిగూడెం గ్రామంలో ప్రజలు అడిగిన వెంటనే సీసీ రోడ్డు మంజూరు చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే మెచ్చా తెలిపారు. అనంతరం నారంవారిగూడెం గుర్రాల చెరువు వైపుగా 2.5 కిలో మీటర్ రూ. కోటి 78లక్షల వ్యయంతో పోస్తున్న బిటి రోడ్డు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాతఅల్లిగుడెం గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు మెచ్చా కి గ్రామప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరెంట్ స్థంబాలు ఏర్పాటు చేయాలని, ఓల్టేజ్ సమస్య ఉందని తెలుపడంతో వెంటనే ఏడితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పేరాయిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుతు సర్పంచ్ అద్వర్యంలో మహిళలు శాలువాతో సత్కరించారు. అలాగే మిగిలిన వీధుల్లో కూడా రోడ్డు మంజూరు చేయాలని కోరారు, దానికి తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. గుర్రాలచెరువు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభానికి వెళ్ళిన సందర్భంలో అదే గ్రామంలో పలు సీసీ రోడ్లు కావాలని కోరారు అలాగే అదే గ్రామంలో ఒక వృద్దుడికి పెన్షన్ రావట్లేదని తెలుపడంతో వెంటనే స్పందించి అధికారితో మాట్లాడి ఏర్పాటు చేయమని ఆదేశించారు. సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తా అని మెచ్చా వారికి తెలుపడంతో వారి మాట్లాడుతూ మీ మాట మీద మాకు నమ్మకం ఉంది సారు, మీరు చెప్పారంటే చేస్తారు, గతంలో మంచి నీటి సమస్య ఉందని తెలుపడంతో వెంటనే స్పందించి పరిష్కరించారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ , వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !