మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 17
మణుగూరు మండలం,సమితి సింగారం పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మణుగూరు ఎంపీడీవో యం. చంద్రమౌళి అధ్యక్షతన సీఎం కప్ -2023 విజేతలకు మెరిట్ సర్టిఫికెట్స్,బహుమతుల ప్రధానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాజడ్పిటిసి,పోశం.నరసింహారావుపాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో తహసిల్దార్ కె నాగరాజు,ఎంపీఓ పి. వెంకటేశ్వరరావు,మండల విద్యాశాఖ అధికారి పి వీరస్వామి,మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే జావిద్ పాషా,సర్పంచులు బచ్చల. భారతి,ఏనిక ప్రసాద్,కొమరం జంపేశ్వరి,బోగ్గం.రజిత,తాటి రామకృష్ణ,కారం ముత్తయ్య, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.