మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 17
మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు తెలియజేశారు.రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉపయోగకరంగా ఉండడం కోసం జీలుగు విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తున్నదని అని వారు తెలియజేశారు. వర్షాకాలం మాగాణిలో ముందుగా వేసవి దుక్కి దున్నే అప్పుడు జీలుగు విత్తనాలను చల్లి,మొలిచిన తర్వాత నాటు వేసే ముందు దమ్ము ట్రాక్టర్ తో పచ్చి రొట్టెను తొక్కించినట్లయితే సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుందన్నారు.తద్వారాధాన్యం అధిక దిగుబడి రావటానికి,దోహదపడుతుందని తెలిపారు.రైతులు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జీలుగు విత్తనాలను,ఉపయోగించుకోవాలని వారు కోరారు. జిలుగులు 30 కేజీల బస్తా పూర్తి ధర 2047 రూపాయాలు కాగా,సబ్సిడీ 1564 రూపాయలు పోను రైతుకు 842 రూపాయల ధరకు ఇస్తున్నామన్నారు.విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు తెలిపారు.