మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 17: క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని , ఓటమిని గెలుపుకు పునాదిగా చేసుకొని ముందుకు పోవాలని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సిఎంకప్ క్రీడా పోటీల ముగింపు సభలో ఆమె పాల్గొని, క్రీడకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..మూడురోజుల పాటు జరిగిన క్రీడల్లో వాలీబాల్-16, కబడ్డీ-8, ఖోఖో-4టీంలు పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో యువతి,యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం జరిగిందన్నారు. క్రీడలతో మంచి గుర్తింపు పొందవచ్చని, ఉపాధి అవకాశాలు సైతం అందిపుచ్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ రేవతి, ఎంఈఓ సత్యనారాయణ,డిప్యూటి తహసీల్దార్ ఎల్ ప్రసన్న, ఎంపిఓ తోట తులసీరాం, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపిటీసీలు లంకా విజయలక్ష్మి, నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, సర్పంచ్ పద్దం వినోద్, తదితరులు పాల్గొన్నారు