UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 అత్యధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో కార్మికులు తగు ఆరోగ్య సూత్రాలు పాటించండి -సింగరేణి వైద్యులు డాక్టర్ పి. శేషగిరిరావు

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 17

అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యం లో ప్రతి కార్మికుడు తగు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సింగరేణి వైద్యులు డాక్టర్ పి.శేషగిరిరావు అన్నారు.పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ దండమూడి రాంబాబు ఆదేశాల మేరకు పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యం లో బుధవారం ఉదయం ఓసి-2 లో ఓబి వెలికితీత పనులు నిర్వహిస్తున్న వి పి ఆర్ దుర్గ ఇన్ ఫ్రా ఓబి కంపెనీలో జరిగిన వేసవి నేపథ్యం కార్మికుల ఆరోగ్య సూత్రాలు అనే అంశం పై జరిగిన కార్మికుల అవగాహన ప్రచార కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో వాటిని మన శరీరం తట్టుకునే విధంగా ప్రతి కార్మికుడు ఎక్కువ పరిశుభ్రమైన నీరు,చల్లని మజ్జిగ తాగాలని,మద్యానికి దూరంగా ఉండాలని,ఆహార నియమాలు పాటించాలని మాంసాహారానికి,ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలని తగు విశ్రాంతి కూడా తీసుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు.అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలి అనే అంశం మీద కూడా ఆయన రక్షణ సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగబాబు,తోట.రామ్ శంకర్, సీనియర్ పిఓ ఎండి.మదార్ సాహెబ్,ఓ బి కంపెనీ ఇన్ ఛార్జ్ బిపిన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !