మన్యంన్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ ప్రకటించే ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయవాది ,లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భానోత్ రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గెస్ట్ హౌస్ లో కలిసి గిరిజన సమస్యలపై వినతి పత్రం అందించారు.గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ సింగరేణి సంస్థ గిరిజనల హక్కులను కాలరాస్తుందని ఉద్యోగ నియామకాలలో రూల్అప్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కారుణ్య నియామకాల్లో సైతం రూల్ అప్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే సింగరేణిలో జరుగుతున్న కారుణ్య నియామకాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన గిరిజన సమస్యలైన పోడు భూములకు పట్టా పాసు పత్రాలు పంపిణీ 2006 అటవీ హక్కు చట్టం సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని, గిరిజన 10% రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోనీ గిరిజన చట్టాలైన 1/70 పెసా, చట్టాల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారనిఅన్నారు గిరిజనులకు కనీస రక్షణ కలిపించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గిరిజన తెగలపై హత్యలు అత్యాచారాలు అధికమయ్యాయి అని ఆరోపించారు .వెంటనే వీటి పై సమగ్ర విచారణ జరిగి గిరిజన చట్టాల సక్రమకై చర్యలు తీసుకోవాలని పలు సమస్యలను గవర్నర్ కు విన్నవించీ వినతి పత్రం అందించడం జరిగింది. గవర్నర్ ను కలిసిన వారిలో లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
