UPDATES  

 స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్ డీవీ

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్ డీవీ

పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుషావలి

మన్యం న్యూస్, ఇల్లందు…తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచన మేరకు బుధవారం నుంచి ఇల్లందు పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అందులో భాగంగా ఒకటి, రెండు వార్డులలో పారిశుద్ధ కార్మికులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను చేపట్టారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుషావలిలు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ… పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎట్టి పరిస్థితుల్లో చెత్తను బయట వెయ్యరాదని వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికుల శ్రమ వృధా కానీయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు వారా రవి, కటకం పద్మావతి, ఏఈ శంకర్, ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, మున్సిపాలిటీ జవాన్లు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !