- గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి..
- మన్యం న్యూస్ కధనంతో కదలిన పోలీస్ యంత్రాంగం
- ఎన్నాళ్లకు గుణంబా రక్కసి పై గొడ్డలి పెట్టు
- మన్యం న్యూస్ పత్రికకు రుణపడి ఉంటాం ..
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
గుడుంబా రాక్కసి కోరలు చిక్కుకున్న గ్రామాన్ని రక్షించేందుకు కంకణం బద్ధులై ఒకవైపు ప్రజలను చైతన్య పరుస్తూ మరోవైపు గుడుంబా నియంత్రణ పై మన్యం న్యూస్ దినపత్రిక ప్రతిరింపజేసిన ప్రత్యేక కథనంతో కదలిక మొదలైంది.. వెంకటాపురం మండలంలో ఇటీవల ప్రచూరించబడిన గుడుంబా విక్రయాలకు పోలీస్ శాఖ వారు స్పందించారు. మండలం లొ విక్రయాలకు పాల్పడుతున్న ఆయా గ్రామాలకు వెళ్లి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేశారు. వీరభద్రారం బెస్తగూడెం గ్రామాలలో సుమారు పదివేల లీటర్ల బెల్లం పానకాన్ని నల్లబెల్లాన్ని పట్టికను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబాకు సంబంధించిన డ్రమ్ములను ప్రజల ముందే ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ తిరుపతిరావు మాట్లాడుతూ గుడుంబా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని.ఎవరైనా గ్రామాలలో గుడుంబా కాస్తే వారి ఆచూకీ తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేశారు.. ఆలస్యం అయినా కూడా గుడుంబా స్థావరాల పై చేసిన మెరుపు దాడికి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోకముందే ఈ దాడులు జరిగి ఉంటే ఎంతో మంది ప్రాణాలు నిలబడేయని,అయినా సరే ఇంకా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు ఈ మెరుపు దాడి ఊరటనిచ్చిందని మండల ప్రజలు తెలియజేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గుడుంబా విక్రయ సమాచారాన్ని అధికారుల వద్దకు చేరవేసినందుకు మన్యం న్యూస్ పత్రిక ప్రతినిధులకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.