UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 కూనవరం,బొంబాయి కాలనీ రోడ్డును వెంటనే బాగు చేయాలి కాలనీ వాసుల ధర్నా..

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 18

మణుగూరు పివి కాలనీ, కూనవరం రైల్వే గేట్ నుంచి బొంబాయి కాలనీ మహాత్మ గాంధీ బొమ్మ సెంటర్ వరకు గల సింగిల్ రోడ్డును వెడల్పు చేసి మరమ్మత్తులతో పాటు, తారు కూడా వేయాలని డిమాండ్ చేస్తూ,కాలనీ వాసుల ఆధ్వర్యంలో బొంబాయి కాలనీ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు,అధికారులు వెంటనే స్పందించాలన్నారు. అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించక పోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యస్డి. నాసర్ పాషా మాట్లాడుతూ, బొంబాయి కాలనీ రోడ్డు బాగా గుంతల మయంగా మారిందని, రోడ్డు బాగు చేయమని అడిగిన ప్రతిసారి ప్రజా ప్రతినిధులు,ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు కూడా మంజూరయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పడమే కానీ,ఇప్పటివరకు రోడ్డు మాత్రం బాగు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులకు,ఆటోలు ఇతర వాహనాలకు చాలా ఇబ్బందిగా తయారైందని వారు తెలిపారు.రోడ్డు గుంతల భయానికి మణుగూరు ఆర్టీసీ అధికారులు కూడా వయా పీ వీ కాలనీ కొన్ని సర్వీస్ లను రద్దు చేస్తున్నారని,కాలనీ వాసులకు ప్రయాణాలు కూడా కష్టతరం అయ్యాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులు, స్పందించి బొంబాయి కాలనీ, రోడ్డు వెడల్పు చేయాలని మరమ్మతులతో పాటు డాంబర్ కూడా వేయాలని కోరారు.అది కూడా వర్షాకారానికి ముందే పూర్తి నాణ్యత ప్రమాణాలతో చేయాలని కోరారు.అలాగే పివి కాలనీ అంతర్గత రోడ్లు కూడా బాగా పాడైపోయాయని వెంటనే డాంబర్ వేయాలని సింగరేణి యాజమాన్యం స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సింగరేణి కార్మికులుకే.వెంకటేశ్వర్లు,శనిగరపు.కుమారస్వామి,సిల్వేరు.గట్టయ్య,అంకం లక్ష్మీనారాయణ,మందా. అంజయ్య,జానకి ప్రసాద్,ఎం శ్రీనివాస్,ఈ యాకయ్య,ఎండి యూనస్,పి సి మహాపాత్ర, భాస్కర్ రెడ్డి,భూక్య కిషన్, సంకెళ్ల నాగరాజు,పెరుమాళ్, షేక్ జానీ,విల్సన్,రాజ్,లింగిడిసుధాకర్,బంగారి.సత్యనారాయణ,సాయిబాబు,సంతోష్ ,మురళీకృష్ణ,శంకర్,సాంబ,రాజేష్,బి రజనీకాంత్,ఎం. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !