మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో కార్యాలయం లో 54 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్,జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబి, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ,స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు