UPDATES  

 తెదేపా ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జశ్వంత్ యాదవ్ రెండోవర్ధంతి నివాళులర్పించిన టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు

 

మన్యం న్యూస్,ఇల్లందు:తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థిసంఘo టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు పనికర జశ్వంత్ యాదవ్ రెండో వర్ధంతిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో జస్వంత్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణలు మాట్లాడుతూ…జశ్వంత్ యాదవ్ చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఇటు టీఎన్ఎస్ఎఫ్ చేసే విద్యారంగ పోరాటలలో కీలకంగా వ్యవహరించేవాడని తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం మా అందరి మధ్యలో ఇదే పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు చేసుకున్నాడని, ఈ సంవత్సరం మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. తెదేపాకు, టీఎన్ఎస్ఎఫ్ కు జస్వంత్ యాదవ్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ తివారి, జానీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముక్కు శ్రీవేద్, వాసం వినీత్, బ్లూ మూన్స్ స్టూడియో డాన్స్ మాస్టర్ శ్యామ్ పొదిల తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !