మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు బెల్లం సునీల్ దశదిన కర్మలకు బీఆర్ఎస్ ఇలందు పట్టణ అధికార ప్రతినిధి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షులు కుంట నవాబ్, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు కామిసెట్టి సైదులు హాజరయ్యారు. స్థానిక కరెంట్ ఆఫీస్ లోని సునీల్ నివాసం నందు గురువారం జరిగిన దశదిన ఖర్మలలో భాగంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని సునీల్ కుటుంబసభ్యులకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ పాసి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ సింగ్ టాకుర్, కోశాధికారి యలమందల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లచంద్ర శేకర్ బాబు, డ్రైవర్లు యం.సతీష్, రాజలి రమేష్, మహేష్, ఆటో ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.
