మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ తాత మధు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశానుసారం, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సోనీ, భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు, ఎల్లంకి సత్యనారాయణ, మండల రైతు సమితి కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, చౌడం నరసింహారావు, వేల్పుల నరసింహారావు, రామిశెట్టి రాంబాబు, దేవరకొండ కిరణ్, బానోత్ ధర్మ, ఎస్.కె సుభాని తదితరులు పాల్గొన్నారు.