UPDATES  

 కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్ అన్నారు. బుధవారం మద్దుకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, కంటి వెలుగు కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటి సమస్యను బట్టి కళ్లద్దాలను, కంటి సంబంధిత సమస్యల పరిష్కారమే కంటి వెలుగు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు శ్రావణ్ కుమార్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !