మన్యం న్యూస్, మంగపేట.
తాడ్వాయి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మంగపేట మండల కమలాపురం గ్రామ నూతన అధ్యక్ష, కార్యదర్శిలు గా ఎన్నిక కాబడిన బేవార సత్యనారాయణ, మేడిపల్లి శశికుమార్, భూక్యా రవి లను బుధవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క శాలువా తో సన్మానించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసి పదవి కి వన్నెతేచ్చేవిధంగా పనిచేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమం ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, జిల్లా నాయకులు అర్రేమ్ లచ్చిపటేల్,మండల సీనియర్ నాయకులు తుడి భగవాన్ రెడ్డి, తోట అశోక్ తదితరులు పాల్గొన్నారు