UPDATES  

 తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారాచరిత్ర సృష్టించిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు.. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. తల్లి ఆస్తిలో వాటాకు సంబంధించి దాఖలైన అప్పీల్‌పై సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం 44 పేజీలతో తీర్పు వెలువరించింది.

కేరళ తర్వాత స్థానిక భాషలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం.

కాగా, సాధారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుగుతుంటాయి. పిటిషన్ దాఖలు చేసినప్పుడు అనుబంధ పత్రాలు స్థానిక భాషలో ఉన్నా.. వాటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి కోర్టుకు రిజిస్ట్రీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇంగ్లీషులు మినహా మరే భాషలోనూ కోర్టులు స్వీకరించవు.

అయితే, స్థానిక భాషలకి ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో.. కోర్టులు మాతృ భాషవైపు అడుగులు వేస్తున్నాయి. తీర్పులు ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు.. స్థానిక బాషల్లోకి వాటిని తర్జుమా చేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులు కూడా ఆయా రాష్ట్రాల భాషల్లో తీర్పులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత స్థానిక భాష మలయాళంలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు మాత్రమే స్థానిక భాషలో తీర్పు ఇవ్వడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో కింది న్యాయస్థానాల్లో ఒకరిద్దరు న్యాయమూర్తులు మినహా.. తెలుగులో తీర్పులు వెలువరించిన సంఘటనలు అరుదనే చెప్పాలి. తెలుగులో తీర్పు ఇవ్వడం ద్వారా.. జస్టిస్ పీ నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. కక్షిదారులు, ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో తీర్పు వెలువరించామని ధర్మాసనం తెలిపింది. ఏ సందేహాలున్నా వాటి నివృత్తికి ఇంగ్లీషులోని తీర్పును పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.

తెలుగులోనే మొత్తం తీర్పు : సికింద్రాబాద్‌కు చెందిన వీరారెడ్డి కుమారులు చంద్రారెడ్డి, ముత్యంరెడ్డి అనే అన్నదమ్ముల మధ్య.. తల్లికి చెందిన భూవివాదం కోర్టుకు వచ్చింది. తండ్రికి మచ్చబొల్లారంలో 13 ఎకరాలు ఉండగా.. 1974లో ఇద్దరు అన్నదమ్ములు, తల్లికి మధ్య ఆస్తి పంపకం జరిగింది. చంద్రారెడ్డికి 5, ముత్యం రెడ్డికి 4, తల్లికి 4.08 ఎకరాల భూ పంపకం జరిగింది. తల్లి సాలమ్మ మరణం తర్వాత.. ఆమెకు చెందిన భూ వివాదం కోర్టుకు చేరింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !