UPDATES  

 ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం…అర్హత ఉన్న ప్రతీ ఒక్కిరికి అందించాలని డిసైడ్ అయింది.

అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదని నిర్ణయించింది. అందులో భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రతీ ఇంటినీ జల్లెడ పడుతోంది. వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లుఅవసరమైతే సర్వీస్‌ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుంది.

అర్హత ఉన్న వారికి మరో ఛాన్స్ : అర్హులై ఉండి సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ సేవలు అందనివారిని గుర్తించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా

మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించింది.

ప్రతీ ఇంటికి ప్రత్యేక టీంలు : ఇందుకోసం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల టీమ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు.

 

ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు.

ఆగస్టు నుంచి లబ్ది అందేలా : ఇదే కార్యకరమంలో ఎలాంటి సర్వీసు ఫీజు లేకుండానే కుల, స్థానికత, ఆదాయం, వివాహం, జననం, మరణ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌ కార్డులో మొబైల్ నెంబర్ మార్పు వంటి సమస్యలను పరిష్కరించేలా నిర్ణయించారు. జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో ప్రభుత్వ యంత్రాంగం ఈసేవలు అందించనుంది. రేషన్‌ కార్డు డివిజన్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలను ఉచితంగా అందించనున్నారు. పథాలకు అర్హత సాధించిన లబ్దిదారులకు ఆగస్టు ఒకటి నుంచి పథకాలు అందించాలని నిర్ణయించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !