UPDATES  

 చిరుధాన్యాలను పిల్లకు పాలతో కలిపి ఇలా ఇస్తే మంచిదట!

ప్రస్తుతకాలంలో మారిన జీవన శైలీ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలతో డాక్టర్ల దగ్గరికి వెళ్లితే వారు తినే తింది విషయంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం అనే మాట చెబుతున్నారు.
నిజానికి మన పూర్వీకులు చిరు దాన్యాలను ఆహారంగా తీసుకునే వారు. అందుకే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికి కూడా చిరు ధాన్యాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే చిరు ధాన్యాలు పెద్ద వారికి మాత్రమేనా చిన్న పిల్లలకు కూడా ఉపయోగమా అంటూ కొందరిలో అనుమానం ఉంది.

చిరు ధాన్యాలు ఎలాంటి అనుమానం లేకుండా పెద్ద వారితో పాటు చిన్న పిల్లలకు కూడా అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను అందిస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే చిన్న పిల్లలకు కూడా డైట్ లో చిరు ధాన్యాలను వైధ్యులు సూచిస్తున్నారు. . చిరు ధాన్యాలను పిల్లలకు నేరుగా ఇవ్వకుండా.. వాటిని నీటిలో కనీసం అయిదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత వడగట్టి బుట్టలో మరో నాలుగు నుండి ఆరు గంటల పాటు ఉంచాలి. అప్పుడు చిరు ధాన్యాలు మొలక వస్తాయి. అలా మొలక వచ్చిన చిరు ధాన్యాలను నీడలో పూర్తిగా తేమ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆరిన చిరు ధాన్యాల మొలకలను సన్నని వేడి పై లైట్ గా వేయించి వాటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని పిల్లలకు పాలల్లో ఇవ్వడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. డైరెక్ట్‌ గా చిరు ధాన్యాలు తీసుకోలేని పిల్లలు ఇలా పాల పొడి ద్వారా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి అంటూ వైధ్యులు చెబుతున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !