UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 కేరళవారు వంటల్లో కొబ్బరినూనె ఉపయోగించడానికి కారణాలు ఇవే !

కేరళ అనగానే మనకు మొదట గుర్తొచ్చే విషయం అక్కడి వంటకాలు. కారణం అక్కడి వారు వంటల కొరకు కొబ్బరి నూనెను వినియోగిస్తారు. నిజానికి మనం కొబ్బరి నూనెను తలకు రాసుకోవడానికి అలాగే సౌందర్య సాధనంగా వాడుకుంటాము.
అందుకే మనకు వారి వంటకాలు చూడగానే కొబ్బరినూనె జుట్టుకు రాసుకుంటారు కానీ వంటల్లో ఏంట్రా బాబు అని అనుకుంటాము. అయితే అక్కడివారు వంటలకు కొబ్బరి నూనె వాడడానికి గా అసలు కారణాలు ఎవరికీ తెలియదు. కానీ అక్కడ కొబ్బరి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వారు కొబ్బరి నూనెను వంటలకు వినియోగిస్తారని అనుకుంటూ ఉంటారు. కాని కేరళ వాసులు చాలా తెలివి కల్ల వారు అలాగే వారి జీవన విధానం అత్యంత అధునాతంగా ఉంటుంది.

అయినా కూడా కొబ్బరి పాల వంటలే చేస్తూ ఉంటారు. కేరళ వారు కొబ్బరి నూనెలో ఉన్న ఔషద గుణాలు మరియు ప్రయోజనాలు తెలుసుకున్నారు కనుకే కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. కొబ్బరి నూనె వంటల వల్ల కేరళ వారు పొందుతున్న ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనె వంటలు ఈజీగా జీర్ణం అవుతాయి.

జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడంతో పాటు కొబ్బరి నూనెలో ఉన్న కొన్ని కారణాలు శరీరంలో ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు జీర్ణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కడుపులో మంట లేకుండా అల్సర్ మరియు ఇతరత్ర జీర్ణ క్రియలు సరిగ్గా జరిగేలా కొబ్బరి పాల వంట పని చేస్తుంది. చర్మ సమస్యలు ఉన్న వారు కొబ్బరి పాల వంట తింటే కొన్నాళ్లకే మంచి నిగ నిగలాడే చర్మ సౌందర్యం పెరగుతూ ఉంది. అందుకే కేరళ వారి ముఖాలు ముఖ్యంగా అమ్మాయిల ముఖాలు చాలా నునుపుగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

చర్మం సూర్య రష్మికి దెబ్బ తినకుండా కూడా కొబ్బరి పాల ఆహారం పని చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉన్న లారిక్ యాసిడ్‌ పలు ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ లారిక్ యాసిడ్‌ అనేది పళ్ల సమస్యలు మరియు పళ్ల పటిష్టం పై పని చేస్తుంది. రెగ్యులర్ గా కొబ్బరి నూనె ఆహారంతో పళ్లు చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయి. కొబ్బరి నూనె ను సహజంగా అయితే జుట్టుకు రాస్తారు. ఆయుల్‌ తో ఫుడ్ తినడం వల్ల కూడా జుట్టుకు పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. చివరగా అధిక బరువు తో బాధ పడే వారు కొబ్బరి నూనె బోజనం కనీసం నెలన్నర నుండి రెండు నెలల వరకు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !