UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఇమ్యూనిటీ పవర్‌ పెంచడంలో యాపిల్, దానిమ్మ బెస్ట్!

ఎవరైనా అనారోగ్యంతో భాదపడుతున్నారు అని తెలియగానే వారిని చూడడానికి వేలినప్పుడు మనం కచ్చితంగా పండ్లు తీసుకుని వెళ్ళడం అలవటు. ఒకవేళ మనకు వెళ్ళడం కుదరని పక్షంలో కనీసం వారి కొరకు పండ్లను పంపుతాము.
కారణం ఆనారోగ్యంతో ఉన్నవారు పండ్లు తినడం మంచిది అనే ఉద్దేశంతో. అలా తినడం వల్ల వారి ఇమ్యూనిటీ పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు. అయితే మనం రెగ్యులర్‌ గా వాడే పండ్లు అన్ని కూడా ఇమ్యూనిటీ పవర్‌ ను కలిగి ఉండవు. కొన్ని పండ్లు ఆకలిని తీర్చుతాయి..

కొన్ని మనకు తక్షణ శక్తిని అందించి అనారోగ్య సమస్యల నుండి బయటకు తీసుకు వస్తాయి. కొన్ని మాత్రం మన శరీర మెటబాలిజం మొదలుకుని పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలను మాత్రమే కాకుండా భవిష్యత్తులో కలిగే అనారోగ్య సమస్యలకు సైతం కొన్ని పండ్లు ఔషధంగా పనిచేస్తాయి. ప్రతి రోజు మనం తినే పండ్లలో ఆకలి తీర్చే పండ్లు ఏవి..

అనారోగ్య సమస్యలను పెంచే పండ్లు ఏవి.. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడేసే పండ్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి.. మనకు పండు అనగానే ఎక్కువగా అరటి పండ్లు గుర్తుకు వస్తాయి. తక్కువ రేటుతో పాటు వెంటనే శక్తి రావాలంటే అరటి పండు తినాలి.

భవిష్యత్తు గురించి పెద్దగా సంబంధం లేకుండా ఇప్పటికి ఇప్పుడు ఎనర్జీ కావాలంటే తినాల్సిన పండ్లు అరటి పండ్లు. ఆకలిగా ఉన్న సమయంలో రెండు అరటి పండ్లు తినడం వల్ల ఒక రోజంతా మళ్లీ అన్నం కాని ఇతర ఆహార పదార్థాలు కాని తినడం అక్కర్లేదు. కాని అరటి పండ్ల వల్ల ఇమ్యూనిటీ మాత్రం ఎంత దక్కుతుంది అనేది చెప్పలేం. ఇమ్యూనిటీని పెంచే వాటిలో యాపిల్‌ ప్రథమంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఎంతో మంది శాస్త్రవేత్తలు యాపిల్ పై ప్రయోగాలు చేసి దాని అద్భుత ప్రయోజనాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుండో యాపిల్ ను ప్రతి రోజు తినడం వల్ల డాక్టర్‌ కు దూరంగా ఉండవచ్చు అని అంటూ ఉంటారు. అంటే యాపిల్‌ రెగ్యులర్‌ గా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. యాపిల్ లో ఉండే ఫైబర్‌..

విటమిన్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. దానిమ్మ ను ఏ రకంగా తీసుకున్నా కూడా క్యాన్సర్ తో సహా పలు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంచుతుంది. అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దానిమ్మ లు ప్రతి రోజు కనీసం ఒక్కటి అయినా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాది నుండి ఇది కాపాడుతుంది.

క్యాన్సర్‌ కు కారణం అయిన కారకాలను ముందు నుండే గుర్తించి వాటి పై పోరాడేలా మన శరీరం ను దానిమ్మలు రెడీ చేస్తాయి. కివీ పండ్లు కూడా పోషకాలు అధికంగా కలిగి ఉన్నాయి. విటమిన్ సి మరియు పొటాషియం ఇంకా ఫైబర్ లు కలిగి ఉండటం వల్ల శరీరం కు ఔషధ గుణాలు అందిస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ ను కూడా పెంచుతాయి.

ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు రెగ్యులర్‌ గా ఇబ్బంది పెట్టే వారు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వారు ఈ కివీ పండ్ల ను తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగి పోతాయి. ఇలా ఎన్నో రకాల పండ్లు ఉన్నా కూడా వీటితో పాటు మరి కొన్ని పండ్లు మాత్రమే ఇమ్యూనిటీ బూస్టర్స్ గా పని చేస్తాయి. కనుక ఇతర పండ్ల కంటే కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ ను ఎక్కువగా తినేందుకు పిల్లలకు తినిపించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !