UPDATES  

 భోళా దెబ్బకు ట్రెండింగ్‌లో కొరటాల!

మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి.

అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో కాస్త డిసప్పాయింట్‌ గానే ఉన్నారు, అంతేకాదు మెహర్ రమేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ ని వాడుకోవడం తెలియదు అంటూ మెహర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొరటాల శివ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. కొరటాల ఫ్యాన్స్ కొందరు ‘ఆచార్య’ సినిమా గురించి ప్రస్తావిస్తూ… ఈ సమయంలో కొరటాల రియాక్షన్ ఇదే అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తు, ఆయన కాలర్ ఎగరెస్తున్న ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.

గతంలో చిరు, చరణ్‌తో కొరటాల శివ చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు కొరటాలపై కొందరు మెగా ఫ్యాన్స్ ఇదే తరహాలో ట్రోలింగ్, విమర్శలు చేసారు. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ వంతు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెహర్ రమేష్ ఇచ్చిన ఎలివేషన్‌ వేరే లెవల్లో ఉండడంతో.. ఆ వీడియోలను కూడా ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే… ‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందని’ ట్వీట్ చేశారు. మొత్తంగా భోళా శంకర్ దెబ్బకు… కొరటాల ట్రెడింగ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. మరి ఈ సినిమాతో కొరటాల బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !