UPDATES  

 మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం

  • మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం
  • ఘనంగా 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
  • ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు
  • జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 15

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విప్,రేగా కాంతారావు జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు.ఈ సందర్బంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించి,విధ్వంసమైపోయిన తెలంగాణను బిఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా వికాసపథం వైపు నడిపించింది అన్నారు.ప్రజల అవసరాలు,ఆకాంక్షలకు అనుగుణంగా అన్నిరంగాలలో అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది అన్నారు.అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది అని తెలిపారు.అభివృద్ధిలో,సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతుంది అన్నారు.నేడు తెలంగాణ నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని,పంట కాల్వలతో,పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది అన్నారు.మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి అని,వాగులు,వంకలు,వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగల లతో తొణికిసలాడుతున్నాయి అన్నారు.కాళేశ్వర జలధారలతో గోదావరి జీవధారయై తెలంగాణ లో ప్రవహిస్తుంది అన్నారు. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది అని,మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది అని తెలియజేశారు.తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ,గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది అన్నారు.1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిందాని,వారందరికీ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ,పంట పెట్టుబడి సాయం అందించింది అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర,సమ్మిళిత,సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తుంది అని తెలియజేశారు.నేడు స్వేచ్ఛగా స్వాతంత్ర ఫలాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు అని విప్ రేగా తెలిపారు.ఈ కార్యకమం లో జడ్పీటీసీ పోశం నర్సింహారావు,ఎంపీపీ విజయ కుమారి,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,పార్టీ కార్యదర్శులు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,బిఆర్ఎస్వీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !