ఖబడ్దార్ డీవీ *ఎమ్మెల్యే హరిప్రియ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
ఇల్లందు మున్సిపాలిటీలో నీవు చేసిన అక్రమాలను ఉద్యమాలు చేస్తూ పట్టణ ప్రజలకు తెలియజేస్తాం రానున్నరోజుల్లో రాజకీయ సన్యాసానికి సిద్దంగా ఉండు
హరిప్రియదే టికెట్ ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో హరిప్రియ గెలుపు తథ్యం
బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్లు
మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మీద మునిసిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు చేసిన తప్పుడు, అసత్య ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ, 24వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ మేరకు ఇల్లందు పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ ప్రెసిడెంట్ నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అయ్యా పులిగళ్ల మాధవరావు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే హరిప్రియ మీద విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ఆనాడు ఇల్లందు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నీకు పార్టీ టికెట్ ఇచ్చి నిన్న ఒక కౌన్సిలర్ హోదాలో చూడాలని అనుకుంటే అటువంటి ఎమ్మెల్యేకి నమ్మకద్రోహం చేస్తూ ఎమ్మెల్యేమీద నేడు తిరుగుబాటు బావుట ఎగరేయడం అనేది నీ సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నేడు ఒక గిరిజన మహిళ అయిన ఎమ్మెల్యేను కూడా కించపరుస్తూ నీవు చేసిన ఈ ఆరోపణలు మహిళల పట్ల నీకున్న చులకన భావాన్ని వ్యక్తపరిస్తున్నాయని అన్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో ముందంజలో నడిపిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మీద ఇటువంటి అవాక్కులు, చవాకులు పేలితే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ని విమర్శించే స్థాయి మీదికాదని ఒకసారి నువ్వేంటో, నీ గతచరిత్ర ఏంటో తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.