మన్యంన్యూస్,ఇల్లందు:త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కు ఇవ్వటం పట్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తంచేసారు. శ్రీనివాసరెడ్డి, ఇల్లందు మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్లు హైదరాబాదులోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బారాస అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల వెల్లడి కార్యక్రమంలో హరిప్రియతో పాటుగా పాల్గొన్నారు. ఇల్లందు టికెట్ హరిప్రియకి కేటాయించిన సందర్భంగా వారు ఎమ్మెల్యేకి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇల్లందు గడ్డపై బీఆర్ఎస్ జెండాని ఎగరవేయడమే కాకుండా హరిప్రియ నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.
