పినపాక అభ్యర్థిగా రేగా ప్రకటన పట్లహర్షం వ్యక్తం చేసిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
మన్యం న్యూస్, అశ్వాపురం: మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు , తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పినపాక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావుని నియమించిన సందర్భంగాఅశ్వాపురం మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ఆనందంతో క్యాంప్ ఆఫీస్ నందు ఘనంగా సంబరాలు జరిపి శాలువాతో ఘనంగా సన్మానించే శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,దైదా నారాయణ రెడ్డి,ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లరెడ్డి,సూదిరెడ్డి గోపి రెడ్డి,ఏనుగుల సత్యనారాయణ,గొర్రెముచ్చు వెంకటరమణ,గడకారి రామకృష్ణ,ఎండి జావీద్,బొర్ర శ్రీను, తదితర నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
