దారులన్నీ రేగా వైపే
మళ్ళీ రేగాకే మా మద్దతు
*పినపాక యువత
మన్యం న్యూస్,పినపాక: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ కేటాయించిన నేపథ్యంలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. పినపాక మండలానికి చెందిన అనేక మంది యువకులు మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
