*గెలిచేది రేగానే… వచ్చేది కారు సర్కారే
*రేగా కు టికెట్ కేటాయించడం తో వన్ సైడ్ గా మారిన సమీకరణాలు
* హస్తం గుండెల్లో పరిగెడుతున్న రైలు
*భద్రాద్రి జిల్లాలోని బలమైన నేతగా ఎరిగిన రేగా
*రేగా నియోజకవర్గానికి దిక్సూచి
*పోడుపట్టాల రాకతో పూర్తిగా రేగా వైపే జనం
* 40 రోజులు కష్టపడితే… 30 సంవత్సరాలు మనమే:ఎమ్మెల్యే రేగా కాంతారావు
*మన్యం న్యూస్ గుండాల*: మీ సార్ కి టికెట్ రాదు… మీ సారు 100 కోట్లతో దొరికిపోయాడు.. మీ సారు… ఇలా పచ్చి అబద్ధపు కూతలతో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాలం వెళ్లదీశారు. వారి కార్యకర్తలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ… మసి బూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శుభ ముహూర్తాన బి. ఆర్. ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించగా … ఆ జాబితాలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరు రావడం జరిగింది . ఇంతకాలం అబద్దాల మాటలతో కాలం వెళ్లదీసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులురేగాకు టికెట్ ప్రకటనతో డోలాయమానంలో పడిపోయారు .పినపాక నియోజకవర్గంలో గెలిచేది రేగానే రాష్ట్రంలో వచ్చేది కారు సర్కారే అని పినపాక నియోజకవర్గం మొత్తం మాట్లాడుకుంటున్నారు. పినపాక నియోజకవర్గం లో రేగా కాంతరావు ఎవరికి అందని వ్యూహాత్మక ఎత్తుగడలతో నియోజక దూసుకుపోతున్నారు. అభివృద్ధి కి అభివృద్ధి… సంక్షేమానికి సంక్షేమం. పార్టీలోని కిందిస్థాయి నాయకుడితో పాటు అగ్ర నేతలతో సత్సంబంధాలు మెరుగుగా ఉండటంతో ఆయనను వ్యతిరేకించే వారే నియోజకవర్గంలోనైనా జిల్లాలోనైనా ఎవరు లేకపోవడంతో ఆయన జడ్జ్ స్పీడులో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు సమయం ఉన్నప్పుడల్లా నియోజకవర్గాన్ని చుట్టి రావడం ప్రతి గ్రామంలో పర్యటనలు చేయడంతో ఆయనను దగ్గరగా చూసినవారు రేగా అంటేనే పేద ప్రజల ఆశాజ్యోతి అని భావిస్తున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాలలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు రేగా కాంతారావు వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున మొగ్గుచూపుతున్నారు. నియోజకవర్గంలో ఏ క్షణంలో ఎన్నికలు వచ్చిన ముకుమ్మడిగా రేగా కాంతారావుకు మద్దతు పలికేందుకు అన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున ఆకర్షితులైన యువత రేగా కాంతారావు వెంట నడిచేందుకు మొక్కు చూపుతున్నారు. ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఆమడ దూరంలో ఉండే నేతలు ఉన్న ఈ రోజుల్లో అతి సామాన్య వ్యక్తుల ప్రజలతో మమేకమౌతూ దూసుకుపోవడంతో రేగాకు యువతలో అంతా ఇంత క్రేజ్ పెరగలే. నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధితో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పోడు పట్టాలు పెద్ద ఎత్తున రావడంతో పూర్తిగా రేగవైపే జనం మద్దతుగా నిలుస్తున్నారు. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల అభివృద్ధిని తన భుజాలపై వేసుకొని ప్రగతి పథంలో నడుపుతున్న రేగాకాంతారావు వెంట రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కలిసి నడవడం తధ్యమని నియోజకవర్గ ప్రజలు, ఉమ్మడి గుండాల మండల ప్రజలు అంటున్నారు. 2018 ఎన్నికల మెజారిటీని క్రాస్ చేయడమే లక్ష్యంగా రేగ అభిమానులు, బీ.ఆర్.ఎస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
40 రోజులు కష్టపడండి, 30 సంవత్సరాలు అధికారంలో మనమే:పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
కార్యకర్తలతో సోషల్ మీడియాలో ప్రతి సందర్భంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పదేపదే ఒక మాట చెప్పడం జరుగుతుంది. 40 రోజులు కష్టపడితే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని కార్యకర్తలకు ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసానివ్వడం జరుగుతుంది. ఎక్కడి వారు అక్కడే గ్రామ గ్రామాన వాడ వాడల ప్రచారం నిర్వహించాలని, క్యాంపు కార్యాలయానికి అత్యవసరం అయితే తప్ప, మిగతా సమయంలో ప్రజలలో గడపాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు సోషల్ మీడియా సభ్యులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేయడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపు నల్లేరు మీద నడక అనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు.