UPDATES  

 మాకు ఇంటి స్థలాలు ఇవ్వండి

మాకు ఇంటి స్థలాలు ఇవ్వండి
* చర్ల ప్రాంత ప్రజలు కలెక్టర్ కు వేడుకోలు
* కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
గోదావరి లోతట్టు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం
చర్ల మండలం గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలైన గుంపున గూడెం కేశవాపురం కొత్తపల్లి ఆనంద కాలనీ లింగాపురం గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
గత అనేక సంవత్సరాలుగా వరద ముంపు బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని అన్నారు. ప్రస్తుతం చర్ల మండల కేంద్రంలో ఉన్న 117 సర్వేనెంబర్ లో గల ప్రభుత్వ భూమిలో పై గ్రామాలకు చెందిన ప్రజలు చిన్నచిన్న తుప్పలు తొలగించి ఇండ్లు నిర్మాణం చేసుకుంటున్నారని తెలిపారు. అట్టి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి వరద ముంపుకు గురవుతున్న వాస్తవ బాధితులకు ప్రతి కుటుంబానికి 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలము కేటాయించి గృహలక్ష్మి పథకం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ధర్నా కార్యక్రమం పొడుపుగంట సమ్మక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్,
సిపిఎం మండల నాయకులు మచ్చా రామారావు, పొడుపుగంటి సమ్మక్క పామర్ బాలాజీ, శ్యామల వెంకట్, పూనెం సత్యనారాయణ, కుర్సం రాంబాబు, గుద్దేటి రాణి, ఇసంపల్లి భద్రకేళి, గోపమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !