UPDATES  

 సమస్యల వలయం లో అంగన్వాడి కేంద్రం.

సమస్యల వలయం లో అంగన్వాడి కేంద్రం.
వసతులు,పరిశుభ్రత నిల్.
* అందాకారంలో అంగన్వాడి
చిన్నారులకు పొంచి ఉన్న ప్రమాదం.
*అంగన్వాడిఆయా ను నియమించరు
మన్యం న్యూస్ బూర్గంపహాడ్:అంగన్వాడికేంద్రాలు సప్లిమెంటరీ న్యూట్రిషన్, నాన్-ఫార్మల్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్ రిఫరల్ సేవలను అందిస్తాయి.అలాంటి అంగన్వాడి కేంద్రానికి సుస్తీ చేసింది. ఆయా లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.దీనిపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం

మండల కేంద్రంలోని గ్రంధాలయం సమీపంలో గల అంగన్వాడి కేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. చంటి పిల్ల తల్లులు తమ పిల్లలను తీసుకుని ఈ కేంద్రానికి వస్తుంటారు.ఐతే అంగన్వాడి కేంద్రం ముందు ప్రాంతంలో మురుగు, అపరిశుభ్ర పరిస్థితులు ఉండడం చిన్నారి విద్యార్థులకు,బాలింతలు అనారోగ్యం భారిన పడుతున్నారు. మురుగు నిల్వ ఉండడం తో మురుగు నీటిలో దోమలు,ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి. అలాగే అంగన్వాడి కేంద్రం పరిశరాలు అల్లుకు పోయిన గడ్డి,పిచ్చి చెత్తతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఆ గడ్డిలో ఉన్న ఎర్రచీమలు చిన్నారుల పాదాలను,కాళ్ళను కరవసాగి దద్దుర్లు వచ్చే విధంగా కుడుతుంటాయి. కరెంటు వసతి లేక పిల్లలు పలక,బలపం పట్టుకొని కూర్చున్న దగ్గరి నుండి పలకను దిద్దడం కంటే ఈగలను దోమలను కొట్టుకోవడం సరిపోతుంది తప్ప ఒక్క అక్షరం నేర్చుకునే పరిస్థితి లేదు. భోజనం సమయంలో పిల్లలకు ఫ్యాన్,లైట్లు లేక అన్నంలో ఈగలు వాలుతున్నాయి .దీనితో పిల్లలు డెంగ్యూ,పలు రకాల విష జ్వరాలు పిల్లలకు వారి తల్లులకు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి.13 ఏళ్లుగా ఈ అంగన్వాడిలో “ఆయా వర్కర్” లేకపోవటంతో పిల్లలు అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతున్నారు.ఇన్నేళ్లుగా “ఆయా వర్కర్” లేని ఈ అంగన్వాడి పరిస్థితి దయనీయంగా మారింది.పిల్లల ఆరోగ్యంతో చాలగటం ఆడుతున్న సంబంధిత శాఖ అధికారులు,కనీసం గ్రామ పంచాయతీ వారు కూడా ఈ అంగన్వాడి కేంద్రంలో పేరుకు పోయిన గడ్డి,చెత్త మురుగు నీటిని కూడా తొలగించే పరిస్థితి లేక పోవడంతో మహిళలు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సాక్షాత్తు మండలం హెడ్ క్వాటర్ మెయిన్ రోడ్ మీద అంగన్వాడీ కేంద్రం దుస్థితి చూసి వారు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారయంత్రాంగం అంగన్వాడీ కేంద్రం పై దృష్టి సారించింది ఈ కేంద్రానికి ‘ఆయా వర్కర్’ ని నియమించి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, చిన్నారులు, గర్భిణీల రోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !