UPDATES  

 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అహ్లాదకరంగా కనిపించాలి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అహ్లాదకరంగా
కనిపించాలి
* సెప్టెంబర్ నెలాఖరుకు 108 ఇళ్లు పూర్తి చేయాలి
* చుట్టూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
* మంచినీటి పైపులైన్లకు లీకేజీలు ఉండవద్దు
* జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సెప్టెంబర్ నెలాఖరు వరకు అన్ని హంగులతో 108 ఇళ్లు అందచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని
పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 828 ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటిలో 108 ఇళ్లు వచ్చే నెలాఖరు వరకు అన్ని
హంగులతో మున్సిపాల్టీకి అప్పగించాలని చెప్పారు. అంతర్గత రహదారులు వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు పరిశుభ్రం
చేపించాలని చెప్పారు. ఇళ్ల నుండి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు వీలుగా సైడ్ కాలువలు నిర్మించాలని చెప్పారు.
చాలా పనులు పెండింగ్ ఉన్నాయని పనులు పూర్తి చేసేందుకు తక్షణం ప్రారంబించడంతో పాటు ప్రత్యామ్నయంగా పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్, మంచినీరు, వీధి దీపాలు ఏర్పాటు వంటి అన్ని సౌకర్యాలుండాలని అపుడు మాత్రమే మున్సిపల్ అధికారులు ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ నుండి ఇళ్లు అప్పగించిన తదుపరి నిర్వహణ భాద్యతలు మున్సిపార్టీకి అప్పగించనున్నట్లు
చెప్పారు. మంచినీటి పైపు లైన్లు ఏర్పాటులో ఎలాంటి లీకేజిలు ఉండకుండా చూడాలని చెప్పారు. ఇళ్ల బ్లాకులను పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం మొక్కను నాటి ఈ ప్రాంతంలోని
ఎక్కడా ఖాళీ ప్రదేశం ఉండటానికి వీల్లేకుండా చెట్లును నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలని చెప్పారు. మొక్కలు
నాటడంతో పాటు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘు, కొత్తగూడెం ఆర్డీఓ శిరీష, తహసిల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !