మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం ఎస్సీ కాలనీకి చెందిన నైనరపు శ్రీను ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు గాయపడి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ వారి నివాసానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితులు అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మహిళ అధ్యక్షురాలు చందా.రత్తమ్మ. చందా.నాగేశ్వరరావు, షేక్ రఫీ,పోలెబోయిన. సితారాంబాబు,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
