మణుగూరు 100 పడకల *ఆస్పత్రిలో రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న విప్, పినపాక ఎమ్మెల్యే రేగా సతీమణి సుధారాణి
* రోగులకు బ్రెడ్లు పంపిణీ చేసిన సుధక్క
మన్యం న్యూస్,మణుగూరు: పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావుకు పినపాక నియోజకవర్గం ప్రజలంటే ఎంత మక్కువ తెలియనిది కాదు. పతి బాటలో సతి సైతం సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గురువారం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి రేగ సుధారాణి మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రోగులతో, గర్భిణీ, బాలింతలతో మాట్లాడారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది రోగులతో ప్రేమగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో మణుగూరు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.
