ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్డీ నాయకులు కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామంలో ఎన్డీ పార్టీ నుంచి పలు కుటుంబాలు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే గులాబీ జెండాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..పార్టీ నిర్ణయాలకు ప్రతీ కార్యకర్త కట్టుబడి ఉండాలని చేరిన దిశానిర్దేశం చేసారు. పార్టీ నియమాలను అనుసరించి పనిచేస్తూ పార్టీ పటిష్టనిర్మాణం కొరకు కృషిచేయాలని సూచించారు. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, ఎస్కేపాషా, మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, యువజన నాయకులు, సోషల్ మీడియా ఇన్చార్జి ఎంటెక్ మహేందర్, సనారాజేష్ , నీలం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.