**************************
డీజిల్ దొంగల అరెస్ట్
మన్యం న్యూస్ ,దుమ్ముగూడెం సెప్టెంబర్ 12::
మండల పరిధిలో రెండు నెలలుగా పలు ప్రాంతాల్లో డీజిల్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులు చిక్కకుండా తిరుగుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఎస్సై కేశవరావు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు అనుమాదాస్పద వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. తెల్లం నాగరాజు దబ్బనూతల గ్రామం, సింగరాజు, పోడియం రమేష్ ఢీ కొత్తూరు గ్రామం, ములకలపల్లి మండలం గా తెలిపారు. వీరు లక్ష్మీనగరం, మొలకపాడు ఏరియాలో లారీలు, ట్రాక్టర్ డీజిల్ దొంగతనాలు చేసినట్టుగా దొంగలించి డీజిల్ అమ్ముకున్నామని నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్దనుండి రూ.15 వేల సొత్తు రికవరీ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.