UPDATES  

 ఇల్లందు మండలంలో రూ.6కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

 

ఇల్లందు అభివృద్దే నా ధ్యేయం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చేతులమీదుగా బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది. తొలుతగా కొమరారం నుండి లక్ష్మీనారాయణ తండా వరకు కోటిరూపాయలతో సిసిరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాణిక్యారం నుండి దేశితండా వరకు బీటీరోడ్డుకు 57 లక్షల రూపాయలతో శంకుస్థాపన, పోచారం తండా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి 20లక్షల రూపాయలతో శంకుస్థాపన, గుండాల ఆర్అండ్ బి రోడ్ నుండి సుంకరిగూడెం గ్రామంవరకు బీటీ రోడ్డు నిర్మాణం, రోడ్డు డ్రైను, కల్వర్టు నిర్మాణం కొరకు 1.40 కోట్లతో శంకుస్థాపన, బోయతండా గ్రామపంచాయతీ భవననిర్మాణానికి 20 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా చీమలపాడు పిఆర్ రోడ్డు నుంచి తంగేళ్లగడ్డ స్టేజి, బోటి గుంపు బీటీరోడ్డు నుండి వయా జింకలతండా, గోపాలపురం, కొర్లగుంపు, రాఘబోయిన గూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణం కొరకు 2.29 కోట్లరూపాయలతో శంకుస్థాపన, మొండితోగు, విజయలక్ష్మినగర్ గ్రామపంచాయతీల భవన నిర్మాణానికి 40 లక్షల అంచన వ్యయంతో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఇల్లందు మండలంలో నేడు 6.09 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇల్లందు నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయమని, కేసీఆర్ ప్రభుత్వంలో నేడు మారుమూల గ్రామాలకు కూడా సీసీరోడ్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఐటీడీఏ ఏఈ సలార్, ఇల్లందు మండలం వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, ప్యాక్స్ చైర్మన్ మెట్లకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు శీలంరమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, కోఆప్షన్ సభ్యులు ఘాజి, సరంచులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !