*సెప్టెంబర్ 17 నిజాం సర్కార్ ధమన కాండ
మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య
మన్యం న్యూస్ గుండాల: నిజాం సర్కార్ ధమన కాండకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 17ను భావిస్తామని ప్రజా పంథా మండల కార్యదర్శి, మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఆనాడు ద్రోహమే జరిగిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భక్తి ,భూమి కోసం, పెట్టి చాకిరి విముక్తి కోసం తిరుగుబాటు చేసిన వారిపై అప్పటి సర్కార్ ఉక్కు పాదం మోపడంతో నాలుగువేల మంది అమరత్వం పొందారని అన్నారు. ఏదేమైనా ఎప్పటికీ సెప్టెంబర్ 17 విద్రోహ దినమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శనప్ప కుమార్, ఈసం కృష్ణ, కోడూరి జగన్, మాచర్ల కోటేష్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
