ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వినాయక చవితి పర్వదినం సందర్భంగా
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో దిగ్విజయంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి విజ్ఞాలు లేకుండా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మన జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ప్రజావాణి తాత్కాలికంగా రద్దు..
18వ తేదీ వినాయక చవితి ప్రభుత్వ సెలవు అయినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని డిఆర్వో రవీంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వ సెలవు అయినందున అధికారులు అందుబాటులో ఉండని కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సోమవారం ఐడిఓసి కార్యాలయానికి రావొద్దని చెప్పారు. వినాయక చవితి ప్రభుత్వ సెలవు సందర్భంగా ప్రజలు ప్రజావాణికి ఫిర్యాదులు అందజేసేందుకు ఐడిఓసికి రావొద్దని అధికారులు అందుబాటులో ఉండరని ఆయన సూచించారు.
