UPDATES  

 సమంత సలహా

 

ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్న యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించగా… “ఏదైనా ఒక సమస్య వస్తే, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకోవద్దు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. యువత జీవితం ఇప్పుడే మొదలవుతుంది… కష్టాలు ఎదురవుతాయి, సమస్యలు పలకరిస్తాయి… వాటికి భయపడి పారిపోవద్దు… ధైర్యంగా ఉండండి. సమస్యలు, కష్టాలే మనల్ని రాటుదేలుస్తాయి. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు, నేను ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదు. జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటానని కూడా అనుకోలేదు. పాజిటివ్ దృక్పథం చాలా ముఖ్యం” అని వివరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !