UPDATES  

 కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి

రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి
మన్యంన్యూస్,ఇల్లందు:ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ పీఎస్సిడబ్ల్యూయు-ఇప్టు రాష్ట్రకమిటీ పిలుపుమేరకు ఆదివారం టేకులపల్లి హైటెక్ కాలనీలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సివిల్ ఇంచార్జ్ రాజేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రఅధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి, జరుపుల సుందర్లు మాట్లాడుతూ..గతనాలుగు సంవత్సరాలుగా కాంటాక్ట్ కార్మికుల జీతం నుండి కట్ చేసిన సీఎంపిఎఫ్ లెక్కలు చూపడంలేదని కార్మికులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. పెరిగిన దరగులకనుగుణంగా ఉన్న జీతాలతో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పని చేయించుకునే అధికారులకు మాత్రం లక్షల్లో జీతాలు ఉన్నాయని, కష్టపడే
కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల కోట్లరూపాయల లాభాలు సింగరేణిలో వస్తున్నాయని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు వాటాలుగా పంచుకుంటున్నారని, ఒక ప్రభుత్వ రంగసంస్థలో కార్మికచట్టాలు అమలుచేయకుండా కార్మికులను శ్రమదోపిడీ చేయడం తగదన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు గుర్తింపు ఎన్నికలలో ఓటుహక్కు కల్పించాలన్నారు. ఇప్టు ఆధ్వర్యంలో కాంట్రాక్టుకార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారి ఆందోళనకు పిలుపునిచ్చిందని, ఈ పోరాటంలో కలసిరావాలని కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవికుమార్, నాగమణి, జ్యోతి, బోజ్యా, రవి, బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !