మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరిస్ వర్కర్స్ యునియన్ ఆద్వర్యంలో ఇల్లందు వర్కర్స్ యూనియన్ 16వ మహాసభలోఎన్నికైన నూతన కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సభ్యులు డిప్యూటి ప్రధాన కార్యదర్శి సారయ్య ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ ని ఆదివారం స్థానిక జీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీఎంని నూతన కమిటీసభ్యులు శాలువాతో సన్మానించారు. అనంతరం ఇల్లందు ఏరియా నూతన ఓపెన్ కాస్ట్ గురించి, ఏరియాలో గల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరగా అందుకు జీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ నూతన బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, బ్రాంచి ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, బ్రాంచి సహయ కార్యదర్శులు కొంగర వేంకటేశ్వర్లు, గడదాసు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కొరిమి సుందర్, సంజీవచారి, క్లర్క్ల్ స్టాఫ్ నాయకులు షేక్ ముస్తఫా, వేంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు బొల్లేద్దుల శ్రీనివాస్, గుగులోత్ కృష్ణ, భానోత్ బాలాజీ, దాట్లవేంకటేశ్వర్లు, సాయిరి రాజేవ్వరరావు, హుస్సేన్, కిషోర్, మంచాల వేంకటేశ్వర్లు, లచ్చిరామ్, అనిత, భూషనమ్ తదితరులు పాల్గొన్నారు.