ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్
మావోయిస్టులకు సహకరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు…… సిఐ రాజగోపాల్
మన్యం న్యూస్ చర్ల;
నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని చర్ల సీఐ రాజగోపాల్ అన్నారు.సిపిఐ (ఎంఎల్) ప్రజాపంధా పార్టీ డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న కొండా చరణ్ గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి కొరియర్ గా వ్యవహరిస్తున్నాడని పొలీసులకు సమాచారం ఉందని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో కొండా చరణ్ పై కొన్ని రోజులుగానిఘా పెట్టడం జరిగిందన్నారు.రోజు వారి కార్యక్రమాలలో భాగంగా ఆదివారం చర్ల మండలంలోని చింతగుప్ప గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా,అదే సమయంలో అటుగా వస్తున్న కొండా చరణ్ ని వివరాలు అడుగగా పొంతనలేని సమాదానం చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందన్నారు.ఈ క్రమంలో చరణ్ వద్ద మావోయిస్టు వారోత్సవాలకు సంభందించిన పొస్టర్లు, బ్యానర్లతో పాటు పేలుడు సామాగ్రి లభ్యమైయ్యాయని తెలిపారు.దీంతో కొండా చరణ్ పై కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు.మావోయిస్టుపార్టీ మరి కొంత మంది సహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారు తమ పద్దతి మార్చుకోకపొతే వారిపైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.