విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి
* ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఏ పూజ తలపెట్టిన మొట్టమొదటిగా పూజించేది విఘ్నేశ్వరునని తొలి పూజలు అందుకొనే వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు అని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ఆన్నారు. ఆదివారం ఐటిడీఏ కార్యాలయంలోని ఉద్యోగులు నివాసం ఉంటున్న సముదాయంలో విజయ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం భక్తమండలి సమక్షంలో నిర్వహించారు. అందరూ భక్తి భావంతో కలిసిమెలిసి ఉండే విధంగా కుల మతాలకు తావు లేకుండా ఉండడం కోసమే ఈ పండుగలు జరుపుకుంటామని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె అన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది అందరూ ఐకమత్యంతో ఉండడం వలన ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని మహిళ ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా అభినందించాల్సి ఉందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ డిఎంజిసిసి విజయ్ కుమార్ ఎస్.ఓ సురేష్ బాబు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.