UPDATES  

 పాట అందుకే లేటు

పాట అందుకే లేటు
గుంటూరు కారం పాట విడుదల ఆలస్యానికి కారణం వెల్లడైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గుంటూరు కారం నిర్మాతల నుండి ఈ చిత్రం గురించి అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అందరికీ తెలిసిందే.

అయితే పాట విడుదల మాత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం సాంగ్ రిలీజ్ ఆలస్యానికి కారణం తెలిసొచ్చింది.

చాలా కాలంగా ఈ పాటను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసినప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా విడుదల ఆలస్యమైందని సమాచారం. ఏది ఏమైనా దసరాకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసింది, అయితే ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ కారణంగా ప్రస్తుత షెడ్యూల్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది.

దాంతో ఆర్టిస్టులందరితో షూట్ పూర్తి చేసి, పాటల విడుదలకు వెళ్లాలని టీమ్ నిర్ణయించుకుంది. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు చాలా సమయం వెచ్చించి ది బెస్ట్ అవుట్ పుట్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో పాటల విడుదల మరింత ఆలస్యమైంది. అయితే ఈసారి ఎక్కువ టైమ్ తీసుకోవడం లేదు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, పాటల విడుదల కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంది.

త్రివిక్రమ్ తన సినిమాల్లో పాటల విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు, అనుకున్నదానికంటే ఎక్కువ సమయం వెచ్చిస్తాడు. అల వైకుంఠపురములో సాంగ్స్ అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం త్రివిక్రమ్. సో.. గుంటూరు కారం పాటలు కూడా డిసప్పాయింట్ చేయవని యూనిట్ చెబుతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !