War 2 | YRF Spy Universe బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
War 2| బ్రహ్మాస్త్ర సినిమాతో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకడిగా మారాడు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ. YRF Spy Universe బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ తెరకెక్కని సినిమాగా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. వార్ 2 షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో కొనసాగుతోంది. వార్ 2 యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం 2025 జనవరి 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో హృతిక్‌తో ఢీ అంటే ఢీ అనే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందట.
తారక్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 (NTR30)వ చిత్రంలో నటిస్తున్నాడు.
దేవర టైటిల్‌తో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కీలక పాత్రలో నటిస్తున్నాడు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
వార్ 2 షూటింగ్ విజువల్స్..