UPDATES  

 వనమా రాఘవ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గరం గరం

వనమా రాఘవ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గరం గరం
* వనమా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటామని హెచ్చరిక
* రాఘవ దూకుడుకి కళ్లెం వెయ్యకుంటే ప్రతిఘటన తప్పదు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు తీరు సరిగా లేదని కొంతమంది అధికార పార్టీ బిఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో సుమారు 25 మంది కౌన్సిలర్లు సమావేశమై వనమా రాఘవేంద్రరావు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటామని హెచ్చరించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకు వనమా గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ వనమా రాఘవేందర్రావు ఇష్టారాజ్యంగా తమపై నోరు పారేసుకుని బూతులు తిడుతున్నాడని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వనమా రాఘవేంద్రరావును అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ ఆయన పెత్తనం ఇంకా కొనసాగుతుండడం సహించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మీదున్న అభిమానంతో ఇక్కడ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు. ఎలాంటి కారణాలు లేకుండానే రాఘవ బూతు పురాణంతో తమపై నోరు పారేసుకున్న తీరును సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామని కొంతమంది కౌన్సిలర్లతో పాటుగా మహిళా కౌన్సిలర్ బీమా శ్రీవల్లి భర్త శ్రీధర్ కూడా సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !