UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా

నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అదీకాక ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ సరికొత్త చరిత్రను సృష్టించగా ఆ అవార్డు అందుకున్న క్రమంలో ఈ సందర్భంగా బన్నీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన ట్వీట్ లో తాను ఈ అవార్డు అందుకునే ఘనతకు, కారణం ఆయనే అని సుకుమార్ గురించి చెప్పుకొచ్చాడు.

 

”జాతీయ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఇక నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, భారత ప్రభుత్వానికి, మంత్రిత్వ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు, ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు మన సినిమాను ప్రేమించి, ఆదరించిన వారందరికి చెందుతుంది” అని రాసుకొచ్చారు. ముఖ్యంగా సుకుమార్ సార్ కు నా స్పెషల్ థాంక్స్, ఈ విజయానికి కారణం ఆయనే” అంటూ పోస్ట్ చేశారు.ఇక ఢిల్లీలో అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఆ అనంతరం ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవార్డులు అందుకున్న అందరితో ఫోటోలు దిగి పోస్టు చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆయన హైదరాబాదు తిరిగి రాగా ఆయనకు తన నివాసానికి వెళ్లే మార్గంలో అభిమానుల నుంచి అదిరిపోయే వెల్కమ్ లభించింది. “రాజు వెడలే రవి తేజము లరగగా అన్నట్టు ఆయన ఆ అభిమానుల మధ్య ఒక రాజులా ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పుష్ప రాజ్ ఎక్కడున్నా రాజేరా అని అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !