మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 19:
దేవినవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కారేపల్లి మహిళ భక్తులకు చీరలు పంపిణి జరిగింది.కారేపల్లిలోని శ్రీనివాస బుక్‌స్టాల్ పక్కన ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద నిర్వాహకులు బీఆర్‌ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు పిల్లి వెంకటేశ్వర్లు చీరలను వితరణచేయగా వాటిని సర్పంచ్ ఆదెర్ల స్రవంతి మహిళలకు అందజేశారు.శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపం పద్ద మహిళలు కోలాట నృత్యం ఆకట్టుకుంది.సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించటానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. మండపాల వద్ద ప్రముఖులు పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అజ్మీర వీరన్న,ఏఎంసీ డైరక్టర్ వాంకుడోత్ నరేష్,కమిటీ సభ్యులు చిన్ని శ్రీను,సురేష్ బూబ్,బృందావన్ మధు,సూర్యదేవర వెంకటేశ్వర్లు,రవి తదితరులు పాల్గొన్నారు.
