UPDATES  

 ఇంటర్ అర్హతతో … కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇవి 12 నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.
 
NLC India Limited Recruitment 2020, NLC India Limited Jobs, Central govt jobs, government jobs, Inter jobs, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్, ఎన్ఎల్‌సీ ఇండియా జాబ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇంటర్ ఉద్యోగాలు
 
ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) మొత్తం ఖాళీలు- 56
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 5
 
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 26
విద్యార్హత- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-ICMAI లో ఇంటర్మీడియట్ పాస్ కావాలి.వయస్సు- 2020 మార్చి 1 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్- రూ.22,000
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !