UPDATES  

 పేదల ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం..సామాన్యుడికి అండగా బిఆర్ఎస్ మేనిఫెస్టో..

  • పేదల ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం
  • సామాన్యుడికి అండగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
  • ఆరోగ్య రక్ష తో పేదలకు మెరుగైన వైద్యం
  • అన్నపూర్ణ తో పేదలకు సన్న బియ్యం
  • మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:

 

మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ,కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,బిఆర్ఎస్ హయాం లోనే పినపాక నియోజకవర్గం లో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు.ఆశీర్వదించారు అభివృద్ధి చేసి చూపించానని వారు తెలిపారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు అండగా రైతు బీమా రైతు బంధు,మహిళల కోసం కెసిఆర్ కిట్టు,న్యూట్రిషన్ కిట్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, సౌభాగ్య లక్ష్మి,గృహలక్ష్మి,బీసీ బంధు,దళిత బంధు, వంటి అద్భుతమైన పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం,ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు.బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే,కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి కల్పిస్తామన్నారు.సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలిపారు. ఆరోగ్య రక్ష ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని అన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతుబంధు ఆసరా పింఛన్లు దశలవారీగా పెంచుతామని ప్రజలకు వివరించారు.పేదల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పని చేస్తుందని వారు తెలిపారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలని విప్ రేగా కాంతరావు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,ముత్యాలమ్మ నగర్ పంచాయతీ సర్పంచ్ కొమరం జంపేశ్వరి,బూత్ ఇన్చార్జిలు మేకల రవి,స్థానిక నాయకులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !