మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగుస్తుందని ఎన్నికల సంగం ప్రకటించిన నేపథ్యంలో మన జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలలో
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సమయంపై నియోజకవర్గాలలో అవగాహన కల్పనకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసినట్లు చెప్పారు. సమయపాలనపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచే విధంగా గ్రామ మున్సిపాల్టీలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.